పెళ్ళైన రెండు నెలలకే వివాహిత ఆత్మహత్య! భర్త వేదింపులే కారణం!

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటు చేసుకుంది.చంద్ర జ్యోతి అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళ్తే చంద్రజ్యోతి అనే యువతికి రెండు నెలల క్రితమే శ్రీకాళహస్తికి చెందిన శరత్ అనే వ్యక్తితో పెద్దల సమక్షంలో వివాహం అయ్యింది.

ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా పని చేస్తుంది.అయితే పెళ్ళైన కొద్ది రోజుల నుంచి భర్త వేదింపులు మొదలైనట్లు తెలుస్తుంది.

ఈ వేధింపుల గురించి ఇంట్లో చెప్పిన తల్లిదండ్రులు సర్ది చెప్పి ఉండమని చెప్పినట్లు తెలుస్తుంది.కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, చంద్రజ్యోతిని ఆమె భర్త తరుచుగా కొడుతూ ఉన్నాడని, ఇక భర్త వేధింపులు భరించలేక చంద్ర జ్యోతి ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె భర్త శరత్ నిర్భంధించి శారీరకంగా హింసించి ఉరివేసి చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని చంద్రజ్యోతి తల్లి ఆరోపిస్తున్నారు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రెడీ అవుతున్నారు.

తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?
Advertisement