ఉద్యోగులకు అదిరిపోయే మెసేజ్ పాస్ చేసిన మార్క్ జుకర్‌బర్గ్!

నేడు ఎంతోమంది చిన్ననాటి స్నేహితులు ఒక్కటవుతున్నారంటే దానికో ఒక్కటే కారణం.అదే ఫేస్‌బుక్.

దీనిని మార్క్ జుకర్‌బర్గ్ ఎప్పుడు సృష్టించాడో గాని, అప్పటినుండి సోషల్ మీడియా విప్లవం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.అందుకే యావత్ ప్రపంచం ఇలాంటివారికి దాసోహం అంటుంది.

ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలకేకాదు, కొన్ని లక్షలమందికి జీవనోపాధి కల్పించాడు మార్క్.అయితే ఈ మధ్యకాలంలో పలురకాల కారణాల వలన మెటా తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఫైరింగ్ సందేశం పంపించారు జుకర్‌బర్గ్.సదరు సంస్థలో ఇక పని చేయాలో లేక మానేయాలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించాడు.

Advertisement

ఈ మేరకు ఆయన మెటా ఉద్యోగులకు సందేశం పంపించారు.ఆర్థిక మందగమనం నేపథ్యంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని జుకర్ బర్గ్ హెచ్చరించారు.

ఇంజినీర్ల హైరింగ్ ప్రణాళికల్లో 30% కోత విధించనున్నట్లు తెలిపారు.అలాగే ఉద్యోగంలో టార్గెట్ చేరుకోలేని వారిపై కూడా వేటు తప్పదని చెప్పారు.

సాధారణంగా ప్రతి వారం ఉద్యోగులతో నిర్వహించే ప్రశ్నలు, సమాధానాల సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే ఎప్పుడూ లేని విధంగా ఇటీవల మెటా తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది.2022లో ఇంజినీర్ల నియామక లక్ష్యాన్ని మెటా 6000 నుండి 7000 వరకు కుదించింది.అంతకుముందు ఈ ఏడాది 10,000 మంది కొత్త ఇంజినీర్లను హైర్ చేయాలని మెటా భావించింది.

ఇక ఆర్థిక మందగమనం నేపథ్యంలో తక్కువ మంది ఇంజినీర్లనే రిక్రూట్ చేసుకుంటామని, పరిమిత బడ్జెట్‌లతో తక్కువృద్ధి రేట్లతో మెటా ముందుకెళ్తుందని చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ అన్నారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement