5 లక్షల మంది నిర్మించిన సినిమా గురించి మీకు తెలుసా?

సాధారణంగా సినిమాలను ఒకరు లేదా ఇద్దరు నిర్మాతలు లేదంటే ఒక నలుగురు, ఐదు మంది నిర్మాతలు కలిసి నిర్మిస్తారు.ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది.

ఎక్కువ శాతం సినిమాకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉంటారు.కానీ ఇక్కడ మాత్రం ఒక సినిమాకు ఏకంగా ఒకటి రెండు కాదండోయ్ 5 లక్షల మంది నిర్మాతలు ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారట.

ఒక సినిమాకు ఐదు లక్షల మంది నిర్మాతలు వ్యవహరించడం ఏంటి అని అనుకుంటున్నారా.మీరు విన్నది నిజమే.

ఆ సినిమా పేరు మంథన్.దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషిచేసి శ్వేత విప్లవ పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో దగ్గర దర్శకుడు అయిన శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన సినిమా ఇది.వర్గీస్ కురియన్ రాకతో గుజరాత్ పాడి రైతుల జీవితాలలో కొత్త వెలుగులు నిండాయి.ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం అన్నది గొప్ప విశేషంగా చెప్పవచ్చు.

Advertisement
Manthan Movie Produced By The 5 Lakshs Formers , Mantham Movie , 5 Lakshs, Forme

ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం సముచితం అనే శ్యామ్ ఆలోచనకు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది.

Manthan Movie Produced By The 5 Lakshs Formers , Mantham Movie , 5 Lakshs, Forme

దీంతో ఈ సినిమా భాగస్వాములుగా ఉన్న ఐదు లక్షల మంది రైతులు రూ.2 చొప్పున ఇచ్చారు.కాగా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎక్కువ నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా మంథన్ సినిమా రికార్డులను సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాకుండా భారత దేశంలో కూడా ఇదే తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోనుంది.ఇకపోతే ఈ సినిమాని విజయవంతం చేయాలి అని అప్పట్లో రైతులు ఎద్దుల బండ్లపై గుంపులు గుంపులుగా తేనెలకు తరలివచ్చారు.

ఈ సినిమాలో గిరీశ్‌ కర్నాడ్‌, నసీరుద్దీన్‌షా, అమ్రిష్‌పురి, స్మితా పాటిల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పలు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.ఇక అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ను అందుకుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు