నేను పుష్ప సినిమాలో నటిస్తున్నానా.. మీకు ఎవరు చెప్పారండి.. నటుడు క్లారిటీ!

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప.

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సాధించిందో మనందరికీ తెలిసిందే.

ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, భారీ వసూళ్లను సాధించింది.కాగా ఈ సినిమా విడుదలయ్యి కొన్ని నెలలు అవుతున్నా కూడా ఈ పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.

ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలోని డైలాగులు పాటలే వినిపిస్తూ ఉన్నాయి.మరి ముఖ్యంగా అందులో సామి నా సామి అన్న సాంగ్, తగ్గేదేలే అన్న డైలాగ్ ను ఇప్పటికీ సందర్భాలను బట్టి ఉపయోగిస్తున్నారు ప్రేక్షకులు.

కాగా పుష్ప పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 ని అంతకుమించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.కాగా పుష్ప సినిమా పార్ట్ 2 కి సంబంధించి షూటింగ్ ఉందా మొదలుపెట్టినే లేదు.

Advertisement
Manoj Bajpayee Gives Clarity Being Part Pushpa 2 Pushpa Movie, Manoj Bajpayee, T

కానీ సోషల్ మీడియాలో మాత్రం పుష్ప సినిమా పార్ట్ 2 లో ఈ స్టార్స్, ఆ స్టార్ నటించబోతున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Manoj Bajpayee Gives Clarity Being Part Pushpa 2 Pushpa Movie, Manoj Bajpayee, T

ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కూడా పుష్ప 2 లో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే విషయం గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఈ వార్తలపై స్పందించారు మనోజ్ భాజ్ పాయి.ఈ వార్తలపై స్పందిస్తూ.

మీకు ఇలాంటి వార్తలు ఎవరు చెప్పార్రా నాయనా? అంటూ సోషల్ మీడియాలో తనఫై వినిపిస్తున్న వార్తలు ఇటువంటి నిజం లేదు అని తేల్చి చెప్పేశాడు.మనోజ్ చేసిన ట్వీట్ తో పుష్ప 2 లో అతడు నటించిన లేదు అని స్పష్టమైనది.

కాగా పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే సినిమా విడుదల అయి కొన్ని నెలలు అవుతున్నా కూడా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు