మన్మధుడు 2 లో అవి కట్‌ చేసి తప్పుచేశామంటున్న మేకర్స్‌

నాగార్జున, రకుల్‌ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మధుడు 2 చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సినిమా ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వలేదనే నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

మరి కొందరు ఒక మోస్తరుగా పర్వాలేదని, ఒకసారి చూడదగ్గ చిత్రంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు లీక్‌ చేయడం జరిగింది.

అదేంటీ అంటే మన్మధుడు 2 చిత్రం షూటింగ్‌ సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ చాలా తీశారు.వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌ మరియు నాగార్జునల కాంబోలో చాలా కామెడీ సీన్స్‌ తీయడం జరిగింది.

దాదాపుగా 30 నిమిషాల ఆ కామెడీ సీన్స్‌ను లెంగ్త్‌ ఎక్కువ అవుతున్న కారణంగా తొలగించడం జరిగిందట.కొన్ని సీరియస్‌ సీన్స్‌ తొలగించి ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ను ఉంచి ఉంటే సినిమా ఫలితం మరియు టాక్‌ మరోలా ఉండేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

Advertisement

సినిమాలో రావు రమేష్‌ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది.కాని షూట్‌ చేసింది మాత్రం చాలా ఎక్కువ అంటూ సమాచారం అందుతోంది.మొత్తంగా సినిమా మూడు గంటలకు పైగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితులో కామెడీ సీన్స్‌ను కట్‌ చేయడం జరిగింది.

ఆ కత్తెరింపు ఇప్పుడు సినిమా ఫలితాన్ని మార్చి వేసిందనే టాక్‌ వినిపిస్తుంది.ఇప్పుడు ఏం అనుకుని ఏం లాభం.సినిమా ముందు నుండే పక్కా ప్రణాళికతో తీసి, ఎంటర్‌టైన్‌ చేస్తే బాగుండేది.

దాదాపుగా 20 కోట్లు బిజినెస్‌ చేసిన మన్మధుడు 2 లాంగ్‌ రన్‌లో 12 నుండి 15 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.