మనీషా కోయిరాలా మృతి అంటూ పేపర్‌లో ప్రకటన.. ఆ ప్రొడ్యూసర్ అలా ఎందుకు చేశాడంటే..??

ఒక మంచి సినిమా కంప్లీట్ కావాలంటే యాక్టర్స్ అందరితో పాటు టెక్నీషియన్లందరూ డైరెక్టర్ సహకరించాలి.వాళ్ల సహకారంతో దర్శకుడు ఒక మంచి మాస్టర్ పీస్ తీయగలరు.

డైరెక్టర్ అనే వాడు ఆర్టిస్టుల నుంచి మంచి నటనను, టెక్నీషియన్ల నుంచి మంచి ఆడియో వీడియో ఔట్‌పుట్‌ను సేకరిస్తాడు.వీడియో ఆడియో ఎడిటింగ్ పార్ట్స్‌ అన్ని అయిపోయాక దాన్ని రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది అది దర్శకుడు బాధ్యత కాదు, అది నిర్మాత పని.పబ్లిసిటీ, ప్రమోషన్స్ జోరుగా చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది.ఇందుకు మూవీ యూనిట్ అంతా సహాయం చేస్తుంది.

సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచాలంటే ప్రొడ్యూసర్ ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ప్రచారానికి బాగా డబ్బు ఖర్చు చేయాలి.అయితే డబ్బు పెట్టలేని వారు అడ్డదారులు తొక్కుతుంటారు.అంటే ఏదో ఒక గొడవ చేసి దాని గురించి ప్రజలందరూ మాట్లాడుకునే లాగా చేస్తారు.

Advertisement

మరి కొంతమంది అయితే చాలా చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటారు.అలాంటి వారిలో క్రిమినల్ నిర్మాత ఒకరు.

తెలుగు, హిందీ భాషల్లో ‘క్రిమినల్‌’ మూవీ విడుదలై మ్యూజికల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా హిందీ వెర్షన్‌కు నిర్మాత ముఖేష్‌ భట్‌( Mukesh Bhatt ).అయితే ఈ మూవీ పబ్లిసిటీ విషయంలో ఆయన ఒక చెడు మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు.సినిమా అందరికీ తెలియాలనే కోరిక నెరవేర్చుకునే క్రమంలో ఆయన వ్యక్తిగతంగా దిగజారారు.

ప్రపంచంలోనే అతి పెద్ద వరస్ట్‌ పబ్లిసిటీకి పూనుకున్నారు.ఆయన ఇలా చేశాక చాలామంది తీవ్రంగా విమర్శించారు.

క్రిమినల్" సినిమా( Criminal )లో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా నటించిన సంగతి తెలిసిందే.దీనికి డైరెక్టర్ మహేష్‌భట్‌( Mahesh Bhatt ).ఈ మూవీ తెలుగు వెర్షన్ 1994 అక్టోబర్‌ 14న విడుదలైంది.హిందీ వెర్షన్‌ 1995 జూలై 21న రిలీజ్ అయింది.

ఇండియన్2 సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తారా.. ఆ రోల్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ అంటూ?
దీపికా పదుకొనే పుట్టబోయేది అబ్బాయా... అమ్మాయా... జ్యోతిష్యులు ఏం చెప్పారంటే?

‘క్రిమినల్‌’ అతి పెద్ద మ్యూజికల్‌ హిట్ అయింది.ఇందులోని ‘తెలుసా.

Advertisement

మనసా.’ పాట చాలామంది హృదయాలను తెలుసుకుంది.హిందీలోనూ ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి.

తెలుగు వెర్షన్‌కి కె.ఎస్‌.రామారావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

హిందీ వెర్షన్‌కి మహేష్‌భట్‌ బ్రదర్ ముఖేష్‌ భట్‌ ( Mukesh Bhatt )నిర్మాత.తెలుగులో ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదని, హిందీ వెర్షన్‌కి కూడా ఆన్సర్ వస్తుందని భయపడ్డారు నిర్మాత.

అందుకే డిఫరెంట్‌గా పబ్లిసిటీ చెయ్యాలని భావించాడు ముఖేష్‌.ఆ ఆలోచనలో ఉంటూ ఓ పేపర్‌లో ఒక యాడ్‌ ఇచ్చాడు.

ఆ ప్రకటన టైటిల్‌ ‘మనీషా కోయిరాలా మృతి’ అని పెట్టారు.అది చూసి బాలీవుడ్ ఆడియన్స్ కంగుతిన్నారు.

ఇది ఓ చీప్ పబ్లిసిటీ యాడ్ మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలకు కూడా తెలియదు.అందుకే ఆమెతో పనిచేసిన చాలా మంది చాలా ఆందోళన చెందారు.

మనీషా కోయిరాలాకు తీరిక లేకుండా కాల్స్ చేశారు.ఈ విషయం మనీషాకు కూడా తెలియదట తన శ్రేయోభిలాషుల నుంచి ఆమె తెలుసుకుని చివరికి షాక్‌ అయిందట.

ఆ తర్వాత నిర్మాత ముఖేష్‌ భట్‌ను చాలా తిట్టేసిందని తెలిసింది.డబ్బుల కోసం ఒకరు చనిపోయారని ఎలా ప్రకటన ఇస్తారు? పిచ్చి పట్టిందా అంటూ చాలామంది అతడిని తిట్టేశారు.అయితే అతడు చేసిన పబ్లిసిటీ కారణంగా మూవీ పై హైప్‌ పెరిగిపోయింది.‘క్రిమినల్‌’ హిందీ వెర్షన్‌ రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా అది రూ.4కోట్లు వసూలు చేసింది.ఏది ఏమైనా ఈ ప్రకటన గురించి తెలుసుకొని ఇప్పటికీ చాలామంది అతడిని తిడుతుంటారు.

తాజా వార్తలు