హామీలే ఎన్నికల అస్త్రాలా ?

సాధారణంగా ఎన్నికల టైమ్ దగ్గరకు వచ్చేసరికి లెక్కకు మించిన హామీలను ప్రకటిస్తూ రాజకీయ పార్టీలు( Political Parties ) నానా హడావిడి చేస్తూ ఉంటాయి.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ వరుసగా మేనిఫెస్టోలను ప్రకటిస్తూ హీట్ పుట్టిస్తున్నాయి.

ఆ మద్య కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలు ఐదు గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి.

ఇలా పలు హామీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ .మేనిఫెస్టో( Manifesto ) ఋపొందించింది.హస్తం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి గట్టిగానే వెళ్లింది.

అయితే సాధ్యం కానీ హామీలను ప్రకటించి ప్రజలను మభ్యపెడుతున్నారనే విమర్శ కూడా హస్తం పార్టీ మూటగట్టుకుంది.

Advertisement

ఎందుకంటే తెలంగాణలో ప్రకటించిన మేనిఫెస్టోనే కర్నాటకలో ప్రకటించి అమలు చేయడంలో మాత్రం వెనుకడుగు వేస్తోంది.దీంతో కాంగ్రెస్ పార్టీ( Congress Party Manifesto ) ప్రకటించిన ఐదు హామీలు ఐదు గ్యారెంటీలపై ప్రజల్లో ఆశించిన స్థాయిలో మద్దతు కనిపించలేదు.ఇక ఇటీవల అధికార బి‌ఆర్‌ఎస్( BRS Manifesto ) కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అమలౌతున్న పథకాలను అలాగే కొనసాగిస్తూ మరికొన్ని పథకాలను కూడా ప్రవేశ పెట్టింది, ఆసరా పెన్షన్లను రూ.5 వేల కు పెంచడం, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3 వేల గౌరవ వేతనం, అర్హులైన వారందరికి రూ.400లకే సిలిండర్, తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి సన్న బియ్యం .ఇలా పలు హామీలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టో రూపకల్పన చేశారు బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్.

ఇక మిగిలింది బీజేపీ( BJP Manifesto ) మాత్రమే.త్వరలో బీజేపీ కూడా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది.మరి కాషాయ పార్టీ హామీలు ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.

ఇక ప్రధాన పార్టీలన్నీ ఇచ్చిన హామీలనే ఎన్నికల అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్ళేందుకు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.మరి అధికారం దక్కించుకునేందుకు హామీలు మాత్రమే గట్టెక్కిస్తాయా ? అంటే లేదనే చెప్పాలి.మరి అధికారం కోసం ఈ కొద్ది రోజుల్లో ప్రధాన పార్టీలు ఇంకెలాంటి జిమ్మీక్కులు ప్రదర్శిస్తాయో చూడాలి.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు