తుక్కుగూడ సభా వేదికపై మ్యానిఫెస్టో ప్రకటన..: సీఎం రేవంత్

తుక్కుగూడ ‘జనజాతర’ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పరిశీలించారు.

ఈ నెల 6న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ( AICC President Mallikarjuna Kharge )హాజరవుతారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.సభలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటన ఉంటుందన్నారు.

కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తీసుకెళ్లే ఐదు అంశాలతో పాటు తెలంగాణకు సంబంధించిన అంశాలు మ్యానిఫెస్టోలో ఉంటాయని తెలిపారు.ఇదే గడ్డపై నుంచి సోనియా గాంధీ( Sonia Gandhi ) తెలంగాణకు ఆరు గ్యారెంటీలు ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను నూటికి నూరుశాతం అమలు చేస్తామని తెలిపారు.50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని వెల్లడించారు.తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేకమన్న రేవంత్ రెడ్డి తెలంగాణను బీఆర్ఎస్ నేతలు నాశనం చేశారని ఆరోపించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు