వైసీపీలోకి 'మంచు' వారబ్బాయి...? జగన్ తో భేటీ !

టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా, నందమూరి తారక రామారావు వీరాభిమానిగా.హీరో మంచు మోహన్ బాబు కు మంచి పేరే ఉంది.

మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న మోహన్ బాబు ఆ తరువాత క్రమంగా ఆ పార్టీని దూరం పెడుతూ వచ్చారు.అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా మోహన్ బాబు సైలెంట్ గా ఉండిపోయారు.

అయితే కొద్ది రోజుల నుంచి మంచు విష్ణు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ.సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా పాలిటిక్స్ గురించి ట్విట్స్ చేస్తున్నాడు.

అయితే తాజాగా మంచు విష్ణు తన భార్య విరోనికా తో కలిసి జగన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Manchu Vishnu Meet To Ys Jagan-వైసీపీలోకి మంచు#8217
Manchu Vishnu Meet To Ys Jagan

లోటస్ పాండ్ కు భార్య విరోనికాతో కలిసి వెళ్లిన మంచు విష్ణు దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపినట్లుగా తెలుస్తోంది.వైఎస్ ఫ్యామిలీకి విరోనికా దగ్గర బంధువు.అయితే వైసీపీ నుంచి మంచు కుటుంబం నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది అనే ప్రచారం ఊపందుకున్న సమయంలో విష్ణు జగన్ తో భేటీ కావడం చర్చకు దారితీసింది.

అయితే ఈ భేటీ సాధారణంగానే జరిగిందని.ఇందులో రాజకీయం ఏమీ లేదని వైసీపీ నాయకులు కొందరు క్లారిటీ ఇస్తున్నారు.అయితే అసలు సంగతి ఏంటి అనేది మాత్రం ఇంకా బయటకి రాలేదు.

విష్ణు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు