ఆస్తికోసం కాదు.. ఆత్మగౌరవం కోసమే గొడవలు ఓపెన్ అయిన మంచు మనోజ్!

గత కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో( Manchu Family ) పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఇలా మంచు కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవల గురించి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తోంది.

ఈ క్రమంలోనే మొదటిసారి మంచు మనోజ్( Manchu Manoj ) మీడియా సమావేశంలో ఈ గొడవల గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.తాను గొడవ చేస్తుంది ఆస్తి కోసం కాదు ఆత్మగౌరవం కోసం ఆత్మ రక్షణ కోసం అంటూ ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

నన్ను తొక్కేయాలన్న ఉద్దేశంతోనే నా ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగుతున్నారని మనోజ్ తెలిపారు.

డబ్బు కోసమో.ఆస్తి కోసమో నేను ఈ పోరాటం చేయటం లేదు.తనని తొక్కేయడానికి తన భార్య పిల్లలను ఈ గొడవలోకి లాగుతున్నారు.

Advertisement

నేను చేస్తుంది ఆత్మగౌరవ పోరాటమని నా భార్య బిడ్డల రక్షణ కోసమేనని ఈయన తెలిపారు.అంతేకాకుండా నన్ను కిందకు తొక్కేయటానికి నా భార్యని కూడా బెదిరిస్తున్నారని ఈయన తెలిపారు.

నా మనుషులను బెదిరించి కొంతమంది గుర్తు తెలియని వారు నా ఇంట్లోకి వచ్చి గొడవకు దిగారు.

నా ఏడు నెలల పాపను, పిల్లలను ఈ గొడవలోకి లాగడం అసలు కరెక్ట్ కాదని, నా పిల్లల ముందే ఇలా చెయ్యడంతో రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరినట్టు మనోజ్ తెలిపారు.దీనికోసం నేను ఎక్కడికైనా వెళ్తా ఈ ప్రపంచంలో ఎవరిని కలవమన్న కలుస్తానని తెలిపారు.ఇలా గత మూడు రోజులుగా మంచి ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో దుబాయిలో ఉన్నటువంటి మంచు విష్ణు( Manchu Vishnu ) వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు.

ఇక ఈయన వచ్చిన తర్వాత ఈ గొడవలకు పరిష్కారం దొరుకుతుందా లేకపోతే మరింత ఉద్రిక్తం అవుతాయా అనేది తెలియాల్సి ఉంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు