Manchu Lakshmi : శ్రీకాకుళం జిల్లాలో సందడి చేసిన సినీ నటి మంచు లక్ష్మి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినీ తార మంచు లక్ష్మి మంగళవారం స్మార్ట్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు.

టీచ్ ఫర్ చేంజ్ నిర్వహిస్తున్న మంచు లక్ష్మి శ్రీకాకుళం జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు.

నిర్దేశించిన ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా తరగతి గదులను కేటాయించి స్మార్ట్ క్లాసులను నిర్వహిస్తారు.స్మార్ట్ క్లాసులకు తన సొంత నిధులను కేటాయించి తరగతుల నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

Manchu Lakshmi Is A Popular Movie Actress In Srikakulam District , Srikakulam,

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన విద్యను పొందేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఊరేగింపు గా తీసుకు వచ్చిన మంచు లక్ష్మి కి గ్రామ ప్రజలు పూలతో స్వాగతం పలికారు.

సభను ఉద్దేశించి మంచు లక్ష్మి మాట్లాడుతూ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే దోహదపడుతుందని ప్రతీ ఒక్క విద్యార్ధి ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.ఈ కార్యక్రమం “తెలంగాణలో 76కి పైగా స్మార్ట్ క్లాస్ రూమ్ లను టీచ్ ఫర్ చేంజ్ ఏర్పాటు చేసిందని ఈ ఉద్యమాన్ని శ్రీకాకుళం జిల్లా ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకెళ్లడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Advertisement

శ్రీకాకుళం జిల్లాలోని 20 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపరచడానికి మేము పని చేస్తున్నాము.విశాఖపట్నం జిల్లాలో మా అక్షరాస్యత కార్యక్రమం ద్వారా 72 మందికి పైగా అంకితభావం కలిగిన వాలంటీర్ ఉపాధ్యాయులతో మేము ఇప్పటికే మంచి విజయాన్ని సాధిస్తున్నందున ఉత్తర ఆంధ్రకు తిరిగి రావడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గున్నారు.

Advertisement

తాజా వార్తలు