20sలో కూడా మాయని మూఢనమ్మకాలు.. మేకను పెళ్లిచేసుకున్న ఓ ప్రబుద్ధుడు!

కాలం మారినా, తరాలు మారుతున్నా ఇంకా ప్రజలు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం మానలేదు.

ఈ కథ వింటే 20sలో కూడా మాయని మూఢనమ్మకాల కథలేంటి అని కాస్త విస్మయానికి గురి చేయక మానదు.

కృష్ణాజిల్లాకి చెందిన నూజివీడులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.జాతకంలో దోషాలు ఉన్నాయని.

అందువలన అతగాడికి 2 సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఆ వ్యక్తి ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తూచా పాటిస్తూ మేకకు తాళి కట్టాడు. పట్టణంలోని అన్నవరంరోడ్డు నవగ్రహ ఆలయంలో ఉగాది పండుగ రోజు పొద్దున్న చోటుచేసుకున్న ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది.

అసలు విషయంలోకి వెళితే, కృష్ణాజిల్లాకి తాలూకా నూజివీడుకి చెందిన ఆ వ్యక్తికి ఎప్పటినుండో పెళ్లి కావడంలేదట.ఈ క్రమంలో అతగాడి తల్లిదండ్రులు అతని జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపించారట.

Advertisement

దానికి అతగాడు పై విధంగా చెబుతూ, ముందు ఓ మేకతో వివాహం నెరిపితే పరిస్థితులు చక్కబడి అతగాడికి ఓ అందమైన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుందని చెప్పాడట.దాంతో ఆ యువకుని తల్లిదండ్రులు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది రోజున ఈ తంతు ముగించారట.

కాగా ఈ తంతుని దగ్గరినుండి చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.

ఆధునికి కాలంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలా అంటూ అవాక్కవడం వారి వంతయిందంట.ఇకపోతే ఈ ఘటనలో వారి వూరి ప్రజలు గాని, బంధువర్గం గాని, ఆఖరికి వారి తోబుట్టువులు కూడా పాలు పంచుకోకపోవడం కొసమెరుపు.ఇక ఈ తంతులో ఆ యువకుడి తల్లితండ్రులు అండ్ పూజారి మాత్రమే పాల్గోవడం విశేషం.

ఈ తంతునంతా గమనించిన ఓ చదువరి ఈ తతంగాన్ని ఓ ప్రముఖ మీదవారికి తెలియజేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.దాంతో ఆ కుటుంబం దోష నివారణ కొరకే ఈ రకంగా చేయవలసి వచ్చిందని చెప్పారట.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

దోష నివారణైతే అయిపోయింది.గాని అందమైన వధువు ఒక్కటే మిగిలివుంది.

Advertisement

తాజా వార్తలు