పుట్టినరోజు వేడుక కోసం ప్రియురాలిని రూమ్ కి పిలిచి.. ఆ యువకుడు ఏం చేశాడంటే..?

ప్రేయసి పుట్టినరోజు( Girl Friend Birthday ) కారణంగా పార్టీ ఇస్తానంటూ రూమ్ కు పిలిచి.

గొంతు కోసి హత్య చేసిన సంఘటన బెంగళూరు లోని( Bangalore ) రాజగోపాలనగర పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకెళితే నవ్య (24) హోంశాఖ ఆఫీసులో క్లర్కుగా ఉద్యోగం చేస్తుంది.నవ్య స్వస్థలం రామ నగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్ర గ్రామం.

ఉద్యోగ కారణంగా కోరమంగళ లో నివాసం ఉంటుంది.నవ్యకు దూరపు బంధువైన ప్రశాంత్( Prasanth ) పీణ్య ఫ్యాక్టరీలో ఆపరేటర్ గా పని చేస్తూ, బెంగళూరులోని లగ్గేరి రాజేష్ నగర్ లో ఒక రూమ్ అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు.

Man Kills Girl Friend After Celebrating Birthday In Bengaluru Details, Man Kills

వీరిద్దరూ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.మంగళవారం నవ్య పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పార్టీ ఇస్తానంటూ ప్రశాంత్, రూమ్ కు పిలిచాడు.శుక్రవారం మధ్యాహ్నం కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.

Advertisement
Man Kills Girl Friend After Celebrating Birthday In Bengaluru Details, Man Kills

అయితే నవ్య మొబైల్లో చాటింగ్ చేయడం గమనించి, అనుమానంతో ప్రశాంత్, నవ్యను ప్రశ్నించాడు.దీంతో చిన్నగా ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది.

కోపంతో ఊగిపోతున్న ప్రశాంత్ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయి క్షణికావేశంలో కేక్ కోసిన కత్తితోనే నవ్య గొంతు కోసేశాడు.

Man Kills Girl Friend After Celebrating Birthday In Bengaluru Details, Man Kills

తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులోకి జారిన నవ్య విలవిలలాడుతూ ప్రాణాలు వదిలింది.నవ్య చనిపోయిన విషయం తెలిసి భయంతో ఏం చేయాలో తెలియక ఆమె శరీర భాగాలను కట్ చేసి ఒక సంచిలో పెట్టి ఎక్కడన్నా దూరంగా పడేయాలి అనుకున్నాడు.అందుకు ధైర్యం సరిపోక సాయంత్రం వరకు శవంతో పాటు ఒంటరిగా గదిలోనే ఉండి, తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు.

పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నవ్య తల్లి నాగరత్నకు ఫోన్లో విషయం చెప్పి పిలిపించారు.ప్రశాంత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

గేమ్ చేంజర్ కోసం 25 రోజులు పని చేసా... రెండు నిమిషాలు కూడా లేను : ప్రియదర్శి
Advertisement

తాజా వార్తలు