వీడియో: రేకుల ఇల్లే కానీ లోపలికి వెళ్తే రాజభవనం కూడా దిగదుడుపే..?

ఈ రోజుల్లో మనకు నచ్చినట్టు ఇల్లు పెట్టుకోవాలంటే కనీసం 50 లక్షలు పెట్టాల్సిందే.

అయితే అంత పెట్టలేని వారు లేటుగా ఆలోచించి తక్కువ ఖర్చులోనే రాజభవనం లాంటి ఇల్లులను నిర్మిస్తున్నారు.

బయటి నుంచి చూడ్డానికి పెట్ట లాగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే మాత్రం అది రాజభవనాన్ని తలపిస్తుంది.అలాంటి ఒక ఇల్లుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @arrickpaartalu ఈ వీడియోని పోస్ట్ చేశారు.వీడియోలో, ఒక మహిళ ఓ చిన్న ఇల్లు( Tiny House ) లోపలికి వెళ్తుంది.

బయట నుంచి చూస్తే ఈ ఇల్లు చాలా చిన్నగా ఒక మ్యాచ్‌బాక్స్ లేదా అగ్గిపెట్టలాగా కనిపిస్తుంది.కేవలం టైల్స్ వేసిన రూఫ్‌తో, ఒక ఏసీ యూనిట్‌తో చాలా సింపుల్‌గా ఉంటుంది.

Advertisement

లోపల ఇల్లు చాలా అందంగా ఉంటుందని అని ఎవరూ అనుకోరు.కానీ, మహిళ లోపలికి వెళ్లి చూస్తే ఒక అద్భుతం కనిపిస్తుంది.

ఒక లగ్జరీ హోటల్‌లోని సూట్ లాగా అక్కడ సౌకర్యాలు, బెడ్ లైట్లు కనిపిస్తాయి.వీడియోలో ఆ దృశ్యాలు చూస్తే మనం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టకుండా ఉండలేం.

"బయట నుంచి చూస్తే చాలా చిన్నగా ఉన్న ఇల్లు లోపలికి వెళ్తే మాత్రం అద్భుతమైన డిజైన్‌తో, చాలా లగ్జరీగా ఉంది" అని ఆమె ఆశ్చర్య పోవడం వీడియోలో చూడొచ్చు.నిజానికి ఆ ఇంటిని ఆమె డిజైన్ చేసింది.ఇది చిన్న ఇల్లు అయినా, లోపల చాలా స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా అలంకరించారు.

గోడలకు కళ్లు చెదిరేలా రంగులు వేశారు.బెడ్, డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిజ్, LED టీవీ లాంటి హై-ఎండ్ ఫర్నిచర్‌తో ఇల్లు నిండి ఉంది.

వైరల్ వీడియో : నిజమాబాద్ మేయర్ భర్త శేఖర్ పై ఆటో డ్రైవర్ దాడి
ఓరి నాయనో.. వీరెంత ఫాస్ట్‌గా ప్లేట్లు, కప్పులు, ఫుడ్ అందిస్తున్నారో చూస్తే..?

మెరుస్తున్న వుడెన్ ఫ్లోరింగ్( Wooden Flooring ) ఇంటికి మరింత అందాన్ని తెచ్చింది.మాడ్రన్ లైట్స్( Modern Lights ) ఇంటికి వెచ్చదనం ఇస్తున్నాయి.

Advertisement

ఇల్లు చాలా చిన్నదైనప్పటికీ, ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఉంచడం వల్ల ఇల్లు చాలా కంఫర్టబుల్‌గా కనిపిస్తుంది.

అయితే, ఇల్లు లోపల చాలా బాగున్నప్పటికీ, కొంతమందికి ఒక సందేహం ఉంది.అదేంటంటే, ఇంటి పైకప్పు టైల్స్‌, రేకులతో వేశారు కానీ, సిమెంట్‌తో వేయలేదు.దీని వల్ల ఇల్లు ఎక్కువ కాలం ఉండదేమో అని, వర్షం పడితే ఇబ్బంది కలగవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ దాదాపు కోటి మందిని ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన వాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది ఆ అమ్మాయిని చాలా ప్రశంసించారు.

అంత చిన్న ఇంటిని ఎంత అందంగా అలంకరించిందో అని ఆశ్చర్యపోతున్నారు.మరికొందరు, "ఇంట్లో చిన్న పిల్లలు లేకపోతే ఇల్లు ఇంత క్లీన్‌గా ఉంటుంది" అని హాస్యంగా కామెంట్ చేశారు.

మరికొందరు మహిళలు ఎంత చిన్న ఇల్లు అయినా కూడా దాన్ని చాలా అందంగా అలంకరించగలరని చెప్పారు.

తాజా వార్తలు