టీచర్ తన ప్రేమను అంగీకరించలేదని యువకుడు కత్తితో దారుణం..!

ప్రస్తుత కాలంలో ప్రేమిస్తే ఒక సమస్య.ప్రేమించకపోతే మరో సమస్య.

మొదట ప్రేమించమని వెంటపడడం, అవసరం తీరాక వదిలించుకోవడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది.

ఇంకా ప్రేమించిన వారిని వదిలించుకోవడం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు.

ప్రేమించి ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవాలా అని ప్రేమించడం మానేస్తే వెంటపడి వేధించడంతోపాటు దారుణాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు తనకంటే వయసులో రెండేళ్లు పెద్దగా ఉండే టీచర్ ను( Teacher ) గాఢంగా ప్రేమించాడు.

ప్రేమ విషయం టీచర్ కు చెప్పడంతో అంగీకరించలేదు.దీంతో ఆ టీచర్ పై కత్తితో దాడి చేశాడు.

Advertisement

అసలు కథ ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.రాజస్థాన్ లోని( Rajasthan ) అజ్మీర్ లో ఉండే కీర్తీ సోని (32) స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.అదే ప్రాంతంలో ఉండే వివేక్ సింగ్ (30)( Vivek Singh ) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ టీచర్ వెంట పడేవాడు.

కానీ ఇతని ప్రేమను టీచర్ అంగీకరించలేదు.వివేక్ రోజు వెంటపడుతూ వేధిస్తూ ఉండడంతో ఆ టీచర్ తన స్నేహితుడైన అనిల్ కు విషయం చెప్పింది.

మొదట సర్ది చెబుదామని అనిల్, టీచర్ కలిసి వివేక్ ను ఓ కేఫ్ కు పిలిపించి ఎంత సర్ది చెప్పినా వివేక్ తన తీరు మార్చుకోలేదు.అప్పుడు టీచర్ కూడా నిన్ను నేను ప్రేమించడం లేదు అంటూ స్పష్టంగా చెప్పేసింది.దీంతో వివేక్ ఆగ్రహానికి లోనై తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సోనీ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

సోనీ రక్తపు మడుగులోకి జారి కుప్పకూలింది.వెంటనే అనిల్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.

Advertisement

చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.వివేక్ దాడి చేసిన అనంతరం పారిపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసి వివేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు