వైరల్: బిడ్డకు పాఠాలు నేర్పుతున్న తల్లి ఏనుగుని చూడండి.. ముచ్చటేస్తుంది!

ఈ అనంతమైన సృష్టిలో తల్లి ప్రేమ,( Mothers Love ) బాధ్యతల ముందు ఏదైనా తక్కువగానే కనబడుతుంది.

మనుషులకు మల్లె ఈ భువిపైన మనుగడ సాగిస్తున్న చాలా జీవులకు తల్లే తొలి గురువు.

గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేర్పుతుంది.బిడ్డ తొలి అడుగులు నేర్చుకునేది కూడా తల్లి ఒడిలోనే.

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఏనుగు( Elephant ) తన బిడ్డకు అడుగులు నేర్పుతుండడం చూడవచ్చు.మనసుని హత్తుకొనే ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ సైటింగ్స్( Latest Sightings ) అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో షేర్ కాగా మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంటోంది.అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల( Baby Elephant ) నిలబడడానికి ఇక్కడ శతవిధాలా ప్రయత్నించడం మనం చూడవచ్చు.పిల్ల ఏనుగు మాత్రం నిలబడలేక కింద పడిపోతోంది.

Advertisement

అప్పుడు తల్లి ఏనుగు నిట్టూర్పుని కూడా గమనించవచ్చు.ఏది ఏమైనా తన బిడ్డకు ఆసరాగా నిలిచి, దానికి తొలి అడుగులు నేర్పాలనే పట్టుదలతో తల్లి ఏనుగు మాత్రం ధృడ సంకల్పంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తోంది.

ఫీల్డ్ గైడ్ బ్రెట్ మార్నెవెక్ ఆ అందమైన దృశ్యాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో( Social Media ) పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాన్ని అందరూ చూడగలుగుతున్నారు.ఈ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.కాగా ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

"తన బిడ్ద నిలబడడానికి చేస్తున్న పోరాటం తల్లికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది" అని కొంతమంది కామెంట్ చేస్తే, "ఈ భూమిపై ఏ జీవి అయినా తొలి అడుగుల వేయాలంటే తల్లి అండ ఉండాల్సిందే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరెందుకాలస్యం.

మీరు కూడా ఓ లుక్కేసి మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి మరి!.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement

తాజా వార్తలు