మహేష్‌ సినిమా చూశాకే ఎంపీ అయ్యాడు....!

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండేవారికి కూడా సినిమాలు చూసి ఆనందించే లక్షణం ఉంటుంది.వారికీ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు.

ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకొని సినిమాలు చూస్తుంటారు.ప్రముఖ హీరో మహేష్‌ బాబుకు ఎందరో అభిమానులు ఉన్నారు.

ఆ జాబితాలో మల్కాజ్‌గిరి టీడీపీ ఎంపీ, పేరెన్నికగన్న మల్లా రెడ్డి విద్యా సంస్థల అధినేత మల్లా రెడ్డి కూడా చేరారు.నేను మహేష్‌బాబుకు పెద్ద ఫ్యాన్‌ అని ఆయన చెప్పుకున్నారు.

శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌లో మల్లా రెడ్డి ఈ విషయం చెప్పారు.తానొక రహస్యం చెబుతానని అన్న మల్లారెడ్డి ఎంపీగా నా విజయం వెనక మహేష్‌ బాబు ఉన్నాడు అని చెప్పారు.

Advertisement

ఇదెలా అంటే.మహేష్‌ సినిమా చూశాకే తాను ఎంపీగా గెలిచాడట.! ఒకవేళ మహాష్‌ సినిమా చూశాక ఓడిపోయుంటే.? మల్లారెడ్డి సరదగా చెప్పారు తప్ప అది నిజం కాదు.ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారుగాని అభిమాన హీరోల సినిమాలు చూస్తే గెలుస్తారా? .

నెల‌స‌రి స‌మ‌యంలో పుదీనా తింటే ఏం అవుతుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు