సీలింగ్ కు వేలాడుతున్నకేక్,వెడ్డింగ్ ప్లానర్ అద్భుతం

మామూలుగా పుట్టిన రోజు నాడు మనం అందరం కేకు లు కట్ చేస్తూ ఉంటాం.కానీ ఫారిన్ లో మాత్రం ఏ చిన్న.

పెద్ద అకేషన్ అయినా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తి చేస్తూ ఉంటారు.అలానే ఒక జంట తమ పెళ్లి సందర్భంగా కేక్ ను కట్ చేసింది.

అయితే కేక్ ను టేబుల్ పై ఉంచి కట్ చేస్తారు అందరూ కానీ ఈ జంట మాత్రం గాల్లో కేకును కట్ చేసింది.గాల్లో కట్ చేయడం ఏంటి,అసలు విషయం ఏంటి అని ఆలోచిస్తున్నారా.

వివరాల్లోకి వెళితే.మలేషియా కి చెందిన నటులు జహీరా మ్యాక్విల్సన్,ఇమాం హకీమ్ రెడ్డలు పెళ్లి చేసుకున్నారు.

Advertisement

అయితే ఈ సందర్భంగా వెడ్డింగ్ కు సంబందించిన అన్ని విషయాలను వెడ్డింగ్ ప్లానర్ ప్లాన్ చేసి మరి నిర్వహించారు.అయితే ఈ పెళ్ళికి వచ్చిన అతిధులకు,జంటకు సర్ ప్రయిజ్ ఇవ్వాలని కేకు ను షాన్డిలియర్ లైట్ల తరహాలో సీలింగ్ కు అమర్చాడు.

అయితే అక్కడకి జంట చేరుకున్న తరువాత వెడ్డింగ్ ప్లానర్ ఇప్పుడు ఈ జంట కేక్ కట్ చేస్తుంది అంటూ ప్రకటించారు.దీనితో అందరూ ఆశ్చర్యంగా చూశారు.

అసలు అక్కడ ఎలాంటి కేక్ లేకుండా ఎలా కేక్ కట్ చేస్తారు అని అందరూ ఒకరిమొహాలు ఒకరు చూసుకుంటున్నారు.ఈ సమయంలో రంగు రంగుల లైట్లు వెలిగాయి.

అనంతరం సీలింగ్ నుంచి కేక్ నెమ్మదిగా కిందికి దిగింది.దీనితో అది చూసిన ఆ జంట తో పాటు ఈ పెళ్లి వేడుక చూడడానికి వచ్చిన అతిధులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అచ్చం షాన్డిలియర్ లైట్ల తరహాలో ఉన్న దాన్ని చూసి ఎవరూ కేకని భావించలేదు.

Advertisement

చివరికి వెడ్డింగ్ ప్లానర్.అది కేకని దాని చివరి కొనను కట్ చేయండని చెప్పడంతో అంతా.

‘వావ్’ అంటూ సర్‌ప్రైజ్ అయ్యారు.దీంతో ఆ జంట దాన్ని కట్ చేసి కేకు ముక్కలను ఒకరినొకరు తినిపించుకున్నారు.

అయితే ఆ వెడ్డింగ్ ప్లానర్ చేసిన సర్ ప్రయిజ్ కు అందరూ కూడా ఫిదా అయిపోయారు.