Malavika Sreenath: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన మరో నటి.. గదిలోకి పిలిచి అలా చేశాడంటూ?

క్యాస్టింగ్ కౌచ్.( Casting Couch ) ఈ పేరు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది.

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్లు వారికి ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా వెల్లడించారు.

ఇంకొందరు మాత్రం వారికి జరిగిన చేదు అన్యాయాలు, దారుణాల గురించి బయటకు చెప్పకుండా లోలోపల దాచుకుంటున్నారు.అయితే క్యాస్టింగ్ కౌచ్ అన్నది కేవలం సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదని ఇతర రంగాల్లో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అన్నది ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రముఖ నటి మాళవిక శ్రీనాథ్‌( Malavika Sreenath ) తనకు ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి తెలిపింది.ఈ సందర్భంగా నటి మాళవిక శ్రీనాథ్ మాట్లాడుతూ.ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మూడేళ్ల క్రితం జరిగింది.

Advertisement

మంజు వారియర్‌ కూతురి పాత్ర కోసం నన్ను ఆడిషన్స్‌కు రమ్మన్నారు.నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధాలు లేవు.

అందుకే ఆడిషన్స్‌కు వెళ్లటానికి నిశ్చయించుకున్నాను.సినిమా వాళ్లు మా ఇంటికి కారు పంపారు.

ఒక బిల్డింగ్‌లో ఆడిషన్స్‌ జరుగుతున్నాయి.నేను మా అమ్మ, మా సోదరి అడిషన్స్‌ జరుగుతున్న చోటుకు వెళ్లగా అక్కడ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు.

జుట్టు సరిగా లేదు.మేకప్‌ రూమ్‌ లోపలికి వెళ్లి సరి చేసుకోండి అన్నాడు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

నేను లోపలికి వెళ్లాను.అతడు నా వెంట లోపలికి వచ్చాడు.అతడు లోపలికి వచ్చి నన్ను అసభ్యంగా టచ్ చేయడం మొదలుపెట్టాడు.

Advertisement

ఒక్క పది నిమిషాలు కోపరేట్‌ చేస్తే ఆ పాత్ర నీదే అని అన్నాడు.గది బయట మా అమ్మ, అక్క ఉన్నారన్న భయం కూడా లేకుండా అలా చేశాడు.

నేను భయంతో ఏడుస్తూ అక్కడినుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి బయటకు వచ్చేశాను చెప్పుకొచ్చింది మాళవిక శ్రీనాథ్. కాగా ఆమెకు సినిమాలపై ఉన్న మక్కువతో మొదట మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 2021లో మధురం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇంటర్వ్యూలో భాగంగా మాళవిక శ్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు