ఇదెక్కడి పైత్యం రా బాబోయ్.. విస్కీతో మ్యాగీ నూడుల్స్ తయారీ!

మ్యాగీ నూడుల్స్ ఫుడ్ ( Maggi noodles )ఇండియాలో బాగా పాపులర్ అయిన ఇన్‌స్టంట్ రెసిపీ అని చెప్పవచ్చు.

అందుకే దీన్ని ట్రై చేయని వారు అంటూ ఎవరూ ఉండరు.

ఎందుకంటే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది.తక్కువ సమయంలో ప్రిపేర్ చేయడంతో పాటు సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టే దీనికి ఎంత పాపులారిటీ.

అయితే మ్యాగీ నూడుల్స్‌ను వింత వింతగా తయారు చేస్తూ హడల్‌ పుట్టిస్తున్నారు.

తాజాగా ఒక వ్యక్తి మ్యాగీ నూడుల్స్ తయారు చేయడానికి ఏకంగా విస్కీనే వాడాడు.అది చాలదన్నట్టు ఈ రెసిపీ తయారు చేయడాన్ని వీడియో రికార్డ్ చేశాడు.నూడుల్స్ వండడానికి నీటిని ఉపయోగించకుండా, అతను ఆల్కహాలిక్ డ్రింక్ అయిన విస్కీని ఉపయోగించాడు.

Advertisement

దీనిని సోషల్ మీడియా( Social media )లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.దీంతో ఇంటర్నెట్‌లో చాలా మందికి కోపం వచ్చింది.మ్యాగీ నూడుల్స్‌ వంటి ప్రముఖ ఆహారంలో ఆల్కహాల్‌ను కలపడం ఆరోగ్యకరం కాదని వారు అన్నారు.

విస్కీని సాధారణంగా వంట చేయడానికి ఉపయోగించరు, కాబట్టి ఇది ప్రయోగాన్ని మరింత వింతగా చేసింది.ఈ వ్యక్తి మాత్రం విస్కీ మ్యాగీ( Whiskey )లో వేసినప్పుడు వేడి వల్ల ఆల్కహాల ఆవిరి అవుతుందని, మిగిలిన నీరు వల్ల అది ఉడుకుతుందని తెలిపాడు.విస్కీ ఫ్లేవర్ అందడంతో పాటు మ్యాగీ చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

కానీ నెటిజన్లు అతడు చేసిన ఈ వ్యాఖ్యలను నమ్మడం లేదు.పాపులర్ కావాలనే పిచ్చి కోరికతో ఇలాంటి చెత్త వంటకం చేసి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియో ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్ అయ్యింది.దీనికి చాలా వ్యూస్ వచ్చాయి.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు