హిందీ మేజర్‌కు సాలిడ్ డీల్

యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మేజర్’పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి.

ఇక ఈ సినిమాను ముంబై పేలుళ్ల అధారంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ కూడా పూర్తి ఆసక్తిగా ఉన్నారు.అయితే ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి హిందీ శాటిలైట్ రైట్స్‌కు తీవ్ర పోటీ నెలకొంది.కాగా తాజాగా ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్‌ను ఏకంగా రూ.10 కోట్ల భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఓ సౌత్ చిత్రానికి ఈ రేంజ్‌లో హిందీ శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం నిజంగా విశేషమనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను హిందీ ఆడియెన్స్ కూడా పెద్దగా ఆదరిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.ముంబై పేలుళ్ల బ్యాక్‌డ్రాప్‌తో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథగా ఈ సినిమా రానుండటంతో, మేజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాను శశికిరణ్ డైరెక్ట్ చేస్తుండగా, సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా శోభిత ధూలిపాల, సాయీ మాంజ్రేకర్‌లు నటిస్తున్నారు.

ఈ సినిమాతో అడవి శేష్ మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గలు అంటున్నాయి.ఇక ఈ సినిమాను తొలుత జూలై 2న రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.