పాకెట్ మనీ డొనేట్ చేసిన మహేష్ బాబు కూతురు.. గొప్ప మనస్సు అంటూ?

గొప్పవాళ్ల కడుపున గొప్పవాళ్లే పుడతారని సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెబుతూ ఉంటారు.మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.

సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఊహించని స్థాయికి చేరుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహేష్ నమ్రతల గారాలపట్టి సితార తాజాగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

విదేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న సితార సోషల్ మీడియా ద్వారా సేవా కార్యక్రమాల కోసం వెబ్ సైట్ ను మొదలుపెడుతున్నామని అన్నారు.https://www.maheshbabufoundation.org/ వెబ్ సైట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సితార కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబు ఈ ఫౌండేషన్ ద్వారా పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఫౌండేషన్ కోసం తన పాకెట్ మనీని ఇస్తున్నానని సితార చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సితార నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఈ పోస్ట్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.సితార పోస్ట్ కు సోషల్ మీడియాలో 3000కు పైగా లైక్స్ వచ్చాయి.పాకెట్ మనీని కూడా డొనేట్ చేసిన సితార గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

రాబోయే రోజుల్లో సితార కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో మహేష్ కూతురు సితారకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సితార ప్రస్తుతం చదువుకే సమయం కేటాయిస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సితార సినిమాలనే కెరీర్ గా ఎంచుకుంటారో లేక మరో రంగాన్ని కెరీర్ గా ఎంచుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు