#SSMB28 : దుబాయ్ లో పనులు మొదలు పెట్టిన మహేష్, త్రివిక్రమ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమా సంక్రాంతికి రావాల్సి ఉండగా పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా బరిలో నుండి తప్పుకుంది.ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది.

ఏప్రిల్ 1, 2022 న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా స్టార్ట్ చేస్తాడని అంత భావించిన మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement
Mahesh Babu Trivikram New Movie Update-#SSMB28 : దుబాయ్ లో ప�

వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఇక ఇప్పుడు వీరి కాంబోలో మరొక సారి సినిమా రాబోతుంది.

Mahesh Babu Trivikram New Movie Update

ఇక మూడవసారి రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.మహేష్ కెరీర్లో 28వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Mahesh Babu Trivikram New Movie Update

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.అయితే తాజాగా మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.మహేష్ బాబు త్రివిక్రమ్, థమన్, నాగవంశీ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ వర్క్ అండ్ ఛిల్ల్.

ఈ మధ్యాహ్నం ఈ టీమ్ తో కలిసి పనులు సాగుతున్నాయి అంటూ మహేష్ పోస్ట్ షేర్ చేసారు.ఈ మీటింగ్ దుబాయ్ లో జరిగినట్టు తెలుస్తుంది.ఈ ఫోటో ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు