Mahesh Babu Rajamouli : జక్కన్న సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న మహేష్.. అలా కూడా?

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడాల్సి వచ్చింది.

ఇటీవల తండ్రి కృష్ణ మరణించడంతో మరికొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నారు హీరో మహేష్ బాబు.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని తొందరగా పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు.

రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమాను చేయడానికి రెడీగా ఉన్నారు.అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఆ సినిమాపై హాలీవుడ్ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement
Mahesh Babu Shocking Decision On His Remuneration For Rajamouli Movie , Mahesh B

కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని బడ్జెట్ లో నిర్మించబోతున్నారు.ఈ చిత్ర కథ అడవులలో సాగే అడ్వెంచర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే హీరో ప్రపంచం మొత్తం తిరుగుతూ సాహసాలు చేసే వీరుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu Shocking Decision On His Remuneration For Rajamouli Movie , Mahesh B

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మహేష్ బాబు రెమ్యూనరేషన్ కు సంబంధించిన చర్చలు గురించి వార్తలు వినిపిస్తున్నాయి.మహేష్ ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.ఈ చిత్రానికి రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.

తన రెమ్యునరేషన్ తగ్గించుకొని రాజమౌళితో లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రాజమౌళి కూడా ఆల్రెడీ ఇదే పంథా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

రాజమౌళి తరహాలోనే మహేష్ కూడా ఈ చిత్రానికి లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఒళ్ళు గగుర్పొడిచేలా మహేష్ బాబు సాహసాలని రాజమౌళి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు