మహేష్‌ 'పోకిరి' అడ్వాన్స్ బుకింగ్‌ హౌస్‌ ఫుల్‌

సూపర్ స్టార్‌ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ను ఆగస్టు 9వ తారీకున రీ రిలీజ్ కు ప్లాన్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా ఇతర దేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు పండుగ చేసుకోవడం కోసం పోకిరి సినిమా ను ప్రీమియర్ చేయబోతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఒక్క షో రెండు షో లు కాకుండా కొన్ని థియేటర్లలో ఏకంగా వారం రోజుల పాటు ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల ను గతంలోనే రాబట్టిన పోకిరి సినిమా ను సౌండ్‌ ను మళ్లీ మిక్స్ చేసి కొత్త టెక్నాలజీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.గతంలో చూసిన వారికి కూడా పోకిరి ఇప్పుడు చూస్తే కొత్తగా ఉంటుందని అంటున్నారు.

అందుకే భారీ ఎత్తున పోకిరి అడ్వాన్స్‌ బుకింగ్‌ జరుగుతున్నాయి.అమెరికాలోని పలు స్క్రీన్స్ లో సినిమా ను స్క్రీనింగ్‌ కు ప్లాన్‌ చేశారు.

Advertisement

మహేష్‌ బాబు పోకిరి సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్‌ ను కాలిఫోర్నియాలో మొదలు పెట్టిన వెంటనే హౌస్‌ ఫుల్‌ అయ్యాయి.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఓవర్సీస్ లో ఏ స్థాయి లో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇలియానా నటించిన పోకిరి సినిమా కి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.సినిమా లో బ్రహ్మానందం మరియు అలీ కామెడీ హైలైట్ గా ఉంటుంది.

భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న పోకిరి సినిమా సెకండ్‌ రిలీజ్ లో ఏ స్థాయి వసూళ్లను రాబట్టనుందో చూడాలి. మరో వైపు మహేష్ బాబు తన తాజా చిత్రం ను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు గాను సిద్ధం అవుతున్న విషయం తెల్సిందే.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement