మహేష్ బాబుకు అచ్చిరాని నెల ఇదే.. అప్పుడు రిలీజ్ చేస్తే సినిమా ఫ్లాపేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు( Mahesh Babu ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే మహేష్ బాబు నటించిన సినిమాలు అక్టోబర్ నెలలో విడుదలైతే మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటున్నాయి.

మహేష్ బాబుకు అక్టోబర్ నెల అచ్చిరాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలన్నీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

మహేష్ బాబు నటించిన బాబీ సినిమా( Bobby movie ) 2002 సంవత్సరం అక్టోబర్( October ) 31వ తేదీన విడుదలైంది.ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

మహేష్ కెరీర్( Mahesh Career ) లోని డిజాస్టర్లలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.మహేష్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన అతిథి మూవీ అక్టోబర్ 18వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

Advertisement

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇదే నెలలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖలేజా మూవీ కూడా విడుదలైంది.అక్టోబర్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను ఆగష్టు నెలలో విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరి మహేష్ త్రివిక్రమ్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.ఈ నెల 26వ తేదీన రిలీజ్ డేట్ గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ గత సినిమాలను మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

సినిమా సినిమాకు మహేష్ బాబుకు మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు