మహేష్ ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతాడా..?

సూపర్ స్టార్

మహేష్ బాబు

ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సనిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో చేయాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది.అయితే తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం ఫేం

పరశురాం

డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Will Mahesh Babu Follow Negative Sentiment,Mahesh Babu, Keerthy Suresh, Vamsi Pa

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది.కాగా ఈ సినిమాలో మహేష్ సరసన

కీర్తి సురేష్‌ను

తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా మహేష్ ఓకే అంటాడా లేడా అనేది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది.అయితే ఓ నెగెటివ్ సెంటిమెంట్‌ను మహేష్ ఫాలో అవుతాడా లేడా అనేది కూడా ఈ ఎంపికపై ఆధారపడి ఉంది.

Advertisement

గతంలో కీర్తి సురేష్ స్టార్ హీరోలతో చేసిని సినిమాలేవీ సక్సెస్ కాలేదు.పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి, ధనుష్‌తో రైల్, విక్రమ్‌తో స్వామి స్వేర్ లాంటి సినిమాలు ఘోర పరాజయాలను చవిచూశాయి.

ఒక్క విజయ్‌తో కలిసి చేసిన సర్కార్ మాత్రమే హిట్ అయ్యింది.మరి కీర్తి సురేష్‌తో కలిసి చేస్తే ఈ నెగెటివ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు