1000 కోట్ల మాహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు

వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు.

మరికొన్నేళ్ళ వరకు మహాభారతం తీసేది లేదు, నేను పూర్తిగా సన్నద్ధం అయ్యాకే మొదలుపెడతా అని రాజమౌళి ప్రకటించారు.ఇప్పటికి ఆమీర్ ఖాన్ - రాజమౌళి కథాచర్చలు కూడా జరిపారు.

ఇక షారుఖ్ అమీర్ - జక్కన్నతో కలవలేదు కాని, తాను బాహుబలి కన్నా గొప్పగా మహాభారతం తీయాలనుకుంటున్నాని ప్రకటించాడు.ఇటువైపు వీరు ఇంకా అలోచనలు, చర్చల దశలోనే ఉంటే, అటు మలయాళం వారు ఏకంగా మహాభారతం సినిమా ప్రకటించేసారు.

అది కూడా 1000 కోట్ల బడ్జెట్ తో.యూఏఈ లోని ఒక ఇండియన్ బిజినెస్ మెన్ ఈ సినిమాని 1000 కోట్లతో నిర్మించబోతుండగా, మలయాళ ఆడ్ ఫిలింమేకర్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తాడు.మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రకు ఫిక్స్ అయిపోయారు.

Advertisement

ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి, మిగితా మూడు భాషల స్టార్లని కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.మహాభారతంలో అతికీలకమైన శ్రీకృష్ణభగవానుడి పాత్ర కోసం మహేష్ బాబు, హృతిక్ రోషన్ లో ఒకరిని అనుకుంటున్నామని, అయితే ఇంకా వారితో సంప్రదింపులు జరపలేదని దర్శకుడు నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.

ఈ ఇద్దరు అందగాళ్ళు శ్రీకృష్ణుని పాత్రకి బాగా సరిపోతారు కాని ఇద్దరిలో ఈ పాత్ర చేయడానికి ఎవరు ముందుకొస్తారు అనేది ప్రశ్న.తమిళంలో బాహుబలి రేంజ్ లో మొదలుపెట్టిన సంఘమిత్ర సినిమాకోసం మహేష్ కి 50 కోట్ల పారితోషికం అఫర్ చేసిన మహేష్ ఒప్పుకోలేదు.

రాజమౌళి అడిగితే తప్ప, పౌరాణికాలు, జానపద కథలు చేసే ఆసక్తి లేదని ప్రిన్స్ ఇప్పటికే ప్రకటించాడు.సో, మలయాళ మహాభారతానికి ఇక హృతిక్ రోషనే దిక్కు అన్నమాట.

తాజా వార్తలు