మహానాయకుడు : చంద్రబాబు బయోపిక్‌ పార్ట్‌ - 1

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంచిన నందమూరి తారక రామారావు బయోపిక్‌ ఎన్టీఆర్‌ రెండు పార్ట్‌లుగా తెరకెక్కి విడుదలైంది.మొదటి పార్ట్‌కు మంచి టాక్‌ వచ్చింది.

అయితే కలెక్షన్స్‌ రాలేదు.దాంతో రెండవ పార్ట్‌ను ఒత్తిడి మద్య విడుదల చేశారు.

రెండవ పార్ట్‌కు కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.కాని ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్‌ వస్తున్నాయి.

ఈ బయోపిక్‌ ఎవరిది, ఈ బయోపిక్‌లో ఎవరి గురించి చూపించాఉ అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Advertisement

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడు పాత్ర మరీ ఎక్కువ అయ్యిందని, నాదెండ్ల ఎపిసోడ్‌నే మొత్తం చూపించారు అంటూ, సినిమాలో నాచురాలిటీ మిస్‌ అయ్యిందని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.ఎన్టీఆర్‌ బయోపిక్‌ అని చంద్రబాబు నాయుడు బయోపిక్‌ పార్ట్‌ 1ను చూపించారు.మరి చంద్రబాబు నాయుడు బయోపిక్‌ పార్ట్‌ 2 ఎప్పుడు ఉంటుందని కామెడీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాపై కూడా నెగటివ్‌ కామెంట్స్‌ వస్తున్న నేపథ్యంలో కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో అనే ఆందోళన డిస్ట్రిబ్యూటర్లలో వ్యక్తం అవుతోంది.

ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్‌తో కాస్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు.అయితే చంద్రబాబు నాయుడు పాత్ర ఎక్కువ అవ్వడంతో పాటు కొన్ని అసందర్బ సీన్స్‌ మరియు సహజంగా లేని సీన్స్‌ ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కథానాయకుడు సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ఫలితం మాత్రం దక్కలేదు.

మరి మహానాయకుడు విషయంలో ఏం జరుగుతుందో అనేది చూడాలి.ఎన్టీఆర్‌ మహానాయకుడు విడుదల సమయంలో వర్మ చేసే హడావుడితో సినిమాకు డ్యామేజీ జరుగుతుందని భావించారు.

కాని వర్మ సైలెంట్‌అవ్వడంతో అంతా హ్యాపీగా సాగిపోయింది.

Advertisement