బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న మహాలక్ష్మి.. రవీందర్?

బుల్లి తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమం హిందీలో ఇప్పటికే 16వ సీజన్ ప్రారంభం కాబోతోంది అలాగే తెలుగు 6 వసీజన్ ప్రసారం అవుతుండగా తమిళంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం కాబోతోంది.

ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్ నటి మహాలక్ష్మి జంట ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు సంపాదించుకున్న రవీందర్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ రెండవ వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.భారీ శరీరం కలిగి ఉన్నటువంటి రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన పైన ప్రేమ కాదని అతని వెనుక ఉన్న ఆస్తి కారణమంటూ పెద్ద ఎత్తున వీరు పెళ్లి గురించి ఎన్నో విమర్శలు చేయడంతో ఈ జంట వార్తల్లో నిలిచారు.

అయితే వీరు మాత్రం అలాంటి విమర్శలను ఏమాత్రం లెక్క చేయలేదు.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.అయితే రవీందర్ బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని చూసేవారు.

ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ జంటను ఈ కార్యక్రమంలో ఆహ్వానించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే వీరిద్దరి నిజంగానే బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటున్నారా లేదా అనే విషయం తెలియాలంటే తొమ్మిదవ తేదీ వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు