మోచేతుల నలుపును పర్మినెంట్ గా పోగొట్టే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

సాధారణంగా కొందరికి మోచేతులు( Elbows ) చాలా నల్లగా ఉంటాయి.అబ్బాయిలు ఈ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు.

కానీ, అమ్మాయి మాత్రం అస్స‌లు స‌హించ‌లేరు.బాడీ మొత్తం తెల్లగా మెరిసిపోతూ.

మోచేతులు మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటే తెగ వర్రీ అవుతుంటారు.మోచేతుల నలుపును పోగొట్టుకునేందుకు తోచిన ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీ మీ మోచేతుల నలుపును పర్మినెంట్ గా పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది.

Advertisement

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ ( Oats )వేసి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్,( Green tea powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( curd ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, మూడు టేబుల్ స్పూన్లువే లెమన్ జ్యూస్ ( Lemon juice )సుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని మోచేతులకు ఓ ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా మోచేతులను క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే కొద్ది రోజుల్లోనే మోచేతుల నలుపు మొత్తం మాయం అవుతుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఈ రెమెడీ మీ మోచేతులను తెల్లగా మృదువుగా మార్చడానికి సూపర్ గా సహాయపడుతుంది.కాబట్టి మోచేతులు నలుపు తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మిరాకిల్ రెమెడీని పాటించండి.

Advertisement

మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు