చంద్రబాబుతో భేటీ అయిన మాగంటి బాబు..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

వైసీపీ అధినేత జగన్ "మేమంతా సిద్ధం"( Memantha Siddham ) పేరిట బస్సు యాత్ర చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు "ప్రజా గళం"( Praja Galam ) పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ "వారాహి విజయభేరి"( Varahi Vijayabheri ) పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే టికెట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లకి టికెట్ దక్కని సంగతి తెలిసిందే.

ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో.టికెట్ల విషయంలో త్యాగాలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు ముందుగానే తెలియజేయడం జరిగింది.ఈ రకంగానే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు( Eluru TDP Ex MP Maganti Babu )కి టికెట్ దక్కలేదు.

Advertisement

ఈసారి ఏలూరు లోక్ సభ ఎంపీకి సంబంధించి టికెట్ పుట్టా మహేష్ యాదవ్( Putta Mahesh Yadav ) కి టికెట్ కేటాయించడం జరిగింది.దీంతో మంగళవారం చంద్రబాబుతో మాగంటి బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.ఏలూరు ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని ఎవరైనా కోరారా.

అని చంద్రబాబు అడిగారు.టికెట్ మార్పు పైన చర్చించగా.

సీటు మార్చడం కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారని పేర్కొన్నారు.తనకు రాజ్యసభలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు మాగంటి బాబు తెలియజేశారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు