తండ్రయిన హీరో.. తూచ్.. నేనింకా పిల్లాడినే అంటోన్న వైనం

టాలీవుడ్‌లో ఒక సినిమా పట్టాలెక్కకముందే దానికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి.

ఈ కోవలో పెద్ద, చిన్నా హీరోలు అనే తేడా లేకుండా ఉంటుంది.

వారు నటిస్తున్న సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్తను వైరల్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది.తాజాగా ఈ కోవలోకి వరుణ్ తేజ్ నటించనున్న సరికొత్త సినిమా కూడా చేరింది.

ఆ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రి పాత్రలో నటుడు మాధవన్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.దీంతో మాధవన్ అభిమాని ఒకరు ‘ఇది నిజమా.? మాధవన్ నిజంగా తండ్రి పాత్రలో నటిస్తున్నారా? ఇది నిజం కాదనే అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.ఇది చూసిన మాధవన్ దీనికి తనదైన శైలిలో బదులు ఇచ్చాడు.

‘అది పూర్తిగా అబద్దం, నేను ఇంకా పిల్లాడినే’ అంటూ స్పందించాడు.మొత్తానికి వరుణ్ తేజ్‌కు తండ్రిని చేసేలోపే మాధవన్ ఈ వార్తకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

Advertisement

ఏదేమైనా టాలీవుడ్‌లో వైరల్ కాబోయే వార్తను ముందుగానే చెక్ పెట్టాడు నటుడు మాధవన్.ఇకపోతే ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా ఇది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement