గుడిమల్కాపూర్ పీఎస్ కు మాదాపూర్ డ్రగ్స్ కేసు నిందితులు..!!

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా మరి కొంతమందికి నోటీసులు అందించారు నార్కోటిక్స్ పోలీసులు.ఇదే కేసులో హీరో నవదీప్ ను దాదాపు ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

మరోవైపు ఈ కేసులో ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఈవెంట్ ఆర్గనైజర్, పబ్ ఓనర్ కు ముందస్తుగా బెయిల్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఈనెల 26న గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసుల ఎదుట హాజరుకావాలని తెలిపింది.

Advertisement

ఈ క్రమంలో ఇవాళ డ్రగ్స్ కేసు నిందితులు గుడి మల్కాపూర్ పీఎస్ లో హాజరుకానున్నారు.

Advertisement