Lunar eclipse : హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి అలర్ట్..!

ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ( Lunar eclipse )ఫాల్గుణ పూర్ణిమ రోజు 25వ తేదీన ఏర్పడబోతోంది.

అదే రోజు హోలీ పర్వదినం కూడా ఉంది.

అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల పై ఉంటుందని చెబుతున్నారు.చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశుల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం వల్ల వృశ్చిక రాశి( Scorpio ) వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కెరీర్ లో అనుకున్న స్థాయిలో పురోగతి ఉండదు.

కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.అలాగే వివాదాలకు దూరంగా ఉండాలి.

Advertisement

ఇంకా చెప్పాలంటే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ప్రాణాలకి ప్రమాదం అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.మీ కష్టానికి తగిన గుర్తింపు ఉండదు.

అంతేకాకుండా వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి.ఇంకా చెప్పాలంటే సింహ రాశి వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

జీవితంలో అడ్డంకులు ఎదురు కావడం వల్ల ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది.అనారోగ్యం బారిన పడటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తాయి.

ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి.

వింటర్ సీజన్ లో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం!

సాధ్యమైనంత వరకు దంపతులలో ఒకరైన ఎంతో సహనంగా ఉండాలి.అలాగే మిధున రాశి( Gemini ) వారు అనారోగ్యానికి గురవుతారు.మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

Advertisement

ప్రేమికుల మధ్య విభేదాలు వస్తాయి.అలాగే వ్యాపారస్తులకు భారీ నష్టాలు వస్తాయి.

పెట్టుబడులు పెట్టే విషయానికి దూరంగా ఉంటే మంచిది.లేదంటే తీవ్రంగా నష్టపోతారు.

ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది.భార్యా భర్తలు ఒకరి పై మరొకరికి ఉన్న అనుబంధం తెలియజేసుకుంటూ ఉండాలి.

లేదంటే చిన్న చిన్న సమస్యలకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.

తాజా వార్తలు