LPG సిలిండర్ ఉచిత హోమ్ డెలివరీ కోసం ఇలా చేయండి..

Paytm ద్వారా LPG సిలిండర్‌ ఉచిత హోమ్ డెలివరీ సదుపాయాన్ని పొందవచ్చు.అంతే కాదు మీ అదృష్టం బాగుంటే గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా పొందవచ్చు.

ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి, దానికి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.Paytm తన ప్లాట్‌ఫారమ్ నుండి LPG సిలిండర్‌లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.

దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు తమ LPG సిలిండర్‌లను బుక్ చేసుకోవడానికి Paytmని ఉపయోగిస్తున్నారు.Paytm తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్‌లో కొత్త వినియోగదారులు వారి మొదటి బుకింగ్‌పై రూ.30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.దీని కోసం, వారు Paytm యాప్‌లో చెల్లింపు చేస్తున్నప్పుడు FIRSTCYLINDER ప్రోమోకోడ్‌ను నమోదు చేయాలి.

ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ మొత్తం 3 ప్రధాన LPG కంపెనీల సిలిండర్ బుకింగ్‌పై వర్తిస్తుంది.అవి ఇండేన్, HP గ్యాస్, భారత్ గ్యాస్. Paytm వినియోగదారులు బుక్ నౌ పే లేటర్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు, అంటే ఇప్పుడు బుక్ చేసి తర్వాత చెల్లించడం.

Advertisement

మీరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే, వచ్చే నెలలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం చెల్లించే అవకాశం మీకు లభిస్తుంది.మీరు ముందుగా సిలిండర్‌ను బుక్ చేసుకుంటే, మీరు ఆ మొత్తాన్ని వచ్చే నెలలో చెల్లించాల్సివుంటుంది.

ఈ ఆఫర్ 3 ప్రధాన LPG కంపెనీల సిలిండర్ బుకింగ్‌లకు వర్తిస్తుంది.అవి ఇండేన్, HP గ్యాస్, భారత్ గ్యాస్.Paytm నుండి LPG సిలిండర్‌ను బుక్ చేయడానికి, వినియోగదారు ముందుగా యాప్‌ను తెరిచి, బుక్ గ్యాస్ సిలిండర్ ట్యాబ్‌కు వెళ్లాలి.

దీని తర్వాత గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.మొబైల్ నంబర్ / LPG ID / వినియోగదారు సంఖ్యను నమోదు చేయాలి.ఇప్పుడు మీరు Paytm Wallet, Paytm UPI, కార్డ్‌లు మరియు నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు కోసం మీకు ఇష్టమైన మోడ్‌లో చెల్లించాలి.

మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ మీ నమోదిత చిరునామాకు సిలిండర్‌ను పంపిణీ చేస్తుంది.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు