లవ్ స్టోరీ క్లైమాక్స్.. ఒకటి కాదు రెండు!

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘లవ్ స్టోరి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసేందుకు మరోసారి శేఖర్ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ విషయంలో చిత్ర వర్గాల్లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో శేఖర్ కమ్ముల ఒకటి కాదు రెండు క్లైమాక్స్‌లను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఒకటి హ్యాపీ ఎండింగ్‌ను క్లైమాక్స్‌గా పెట్టగా, మరోటి విషాదంతో కూడిన క్లైమాక్స్‌ను పెట్టాడట.దీంతో ఈ రెండింటింలో దేనిని క్లైమాక్స్‌గా ఫైనల్ చేస్తారా అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది.

Advertisement

చిత్ర యూనిట్‌కు కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటనేది తెలియదంటే శేఖర్ కమ్ముల ఈ సినిమాను ఎంత గోప్యంగా ఉంచుతున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవిల మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో రెండు సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాలో ఎలాంటి అంశాలను మనకు చూపించనున్నారా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.