ట్రైన్ లో ఒక అమ్మాయిని చూసి వెంటనే లవ్ చేసాడు.! చివరికి ఆ అమ్మాయి మూగదని తెలిసి.? రియల్ స్టోరీ!!!

కొన్ని ప్రేమకథలు భలే వింతంగా ఉంటాయి.బాగా గుర్తుండి పోతాయి కూడా.

అలాంటి ప్రేమకథే ఈ కథ… సైట్ కొట్టడం,లైన్ వేయడం లాంటివి తెలియనివారుండరు.

బాగా నచ్చిన అమ్మాయి కనపడినా,లేదంటే అబ్బాయికనపడినా వారికి తెలియకుండా వారినే చూస్తుంటే అదొక ఆనందం.

మనం చూస్తున్నామన్న విషయం వారికి తెలిసి వారు తిరిగి చూస్తే ప్రపంచాన్ని జయించినట్టే.ఇప్పుడు చెప్పే ప్రేమకథ ఒక రైల్వేస్టేషన్లో జరిగింది.

హడావిడిగా స్టేషన్లోకి వచ్చే అప్పుడే బయలుదేరుతున్న ట్రెయిన్ ని రన్నింగ్లో ఎక్కి ఖాలీగా ఉన్న సీట్ దగ్గర కూర్చున్నాడు ఆ యువకుడు.అప్పుడే అక్కడికొచ్చి కూర్చున్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు.

Advertisement

మొదటి చూపులోనే తనకు పిచ్చిపిచ్చిగా నచ్చేయడంతో తననే చూడడం స్టార్ట్ చేసాడు.కానీ ఈ రైలు ప్రయాణం అంతసేపే తను తనతో ఉంటుందని, ఆలస్యం చేస్తే తన ప్రేమను చెప్పలేనని.తనతో మాటకలిపాడు.

తను ఏం మాట్లాడుతున్నా ఆ అమ్మాయి నవ్వుతో సమాదానం ఇస్తుంది తప్ప తిరిగి మాట్లాడట్లేదు…ఆమె నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో కొంచెం నిరుత్సాహపడ్డాడు.అయినప్పటికి పట్టువదలని విక్రమార్కుడిలా వెంటనే ఐ లవ్ యూ చెప్పేసాడు.

ఇంతలో ఆ అమ్మాయికి ఫోన్ రావడం.వీడియో కాల్ లో సైగలతో ఆ అమ్మాయి మాట్లాడడ్ం చూసి ,తను మూగదని ఇంత అందమైన అమ్మాయికి ఈ లోపం చంద్రుడికి మచ్చలా అనిపించి బాదపడ్డాడు.

ఇంతలో ఆ అమ్మాయి తన కాంటాక్ట్ నంబర్ ఇవ్వమని సైగ చేసింది.ఇచ్చాక వెంటనే దానికొక మెసేజ్.

రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

నేనంటే ఇప్పుడు కూడా ఇష్టమా అని…తను మూగదని తెలిసి బాదపడిన మాట వాస్తవమే కానీ.వెంటనే తేరుకుని నేను ఇష్టపడింది నిన్ను.

Advertisement

అంటే పూర్తిగా నిన్నే.నువ్ ఏ లోపంతో ఉన్నా నాకు ఇష్టమే .నువ్ ఒప్పుకుంటే పెళ్లిచేసుకోవడానికి రెడీ అని మెసేజ్ పెట్టాడు.తన రిప్లై రాకముందే తను దిగే స్టేషన్ వచ్చేసింది.

ఇంతలో స్టేషన్ మాష్టార్ వచ్చి టికెట్ అడగడంతో లేదు సర్ నేను జనరల్ టికెట్ తీసుకున్నా ట్రెయిన్ వెళ్లిపోతుందని హడావుడిగా ఎక్కేసా.ఫైన్ కట్టమంటే కట్టేస్తా అని అందాం అనుకున్నా నా పర్సులో టైం కి డబ్బులు లేవు.అతని పరిస్తితిని అర్దం చేసుకున్న అమ్మాయి ఫైన్ కట్టేసి.

ట్రెయిన్ దిగి వెళ్లిపోయింది.మనోడు బాదతో అలాగే కూర్చుంటే ఫోన్ మోగింది మెసేజ్… ఐ లవ్ యూ టూ.నాతో మాట్లాడాలంటే రేపటివరకూ ఆగాల్సిందే ఈ రోజు నేను మౌనవ్రతం అన్నది .ఆ మెసేజ్ సారాంశం.మనోడు యురేఖా అంటూ డోర్ దగ్గరకు పరిగెత్తుకెళ్లి బయట ఆ అమ్మాయిని చూసాడు.

తను తిరిగి చూసి నవ్వింది.