పన్నూన్ హత్యకు కుట్ర కేసు .. భారత్ దర్యాప్తు నివేదికపై వెయిట్ చేస్తున్నాం : అమెరికా

ఖలిస్తాన్ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్( Gurpatwant Singh Pannun ) హత్యకు కుట్ర కేసుకు సంబంధించి నిఖిల్ గుప్తా( Nikhil Gupta ) అనే భారతీయుడిపై అమెరికా ప్రభుత్వం అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు చెక్ రిపబ్లిక్ చెరలో ఉన్న అతనిని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల అమెరికాకు అప్పగించింది.

దీనిపై భారత్ చేస్తున్న దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అమెరికా( America ) తెలిపింది.పన్నూన్‌ను చంపడానికి నిఖిల్ గుప్తా కుట్రకు పాల్పడినట్లుగా గతేడాది నవంబర్‌లో యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

ఉగ్రవాద ఆరోపణలపై భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు అమెరికా, కెనడాలలో ద్వంద్వ పౌరసత్వం ఉంది.గతేడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్‌లో అరెస్ట్ అయిన గుప్తాను జూన్ 14న అమెరికాకు అప్పగించారు.

ఈ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) బుధవారం మీడియాతో మాట్లాడుతూ.వారు (భారత అధికారులు) విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారని చెప్పారు.ఆ ఫలితాలు కోసం తాము ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

అమెరికా గడ్డపై అమెరికా పౌరుడిపై జరిగిన హత్యాయత్నంలో భారత ప్రభుత్వం ప్రమేయంపై దౌత్యపరంగా స్పందించాలని కోరుతూ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సభ్యులు విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌కు( Antony Blinken ) లేఖ రాయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

నిఖిల్ గుప్తాపై ఆరోపణల నేపథ్యంలో అమెరికా అందించిన సమాచారాన్ని పరిశీలించడానికి భారతదేశం ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది.గతవారం తన, యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారతదేశ పర్యటనపై బుధవారం వర్చువల్ మీడియా సమావేశంలో యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ క్యాంప్‌బెల్( Kurt Campbell ) మాట్లాడారు.పన్నూన్ హత్యకు విఫలమైన కుట్ర దర్యాప్తుపై సమాచారం కోరుతూ అమెరికా నిరంతరం భారత్‌పై ఒత్తిడి తెస్తోందన్నారు.

మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్ గతంలోనే స్పందించింది.నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.

అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.ఒకవేళ ఈ కేసులో అతని ప్రమేయం ఉందని తేలితే గుప్తాకు గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పాలస్తీనాకు సపోర్ట్ .. సింగపూర్‌లో అభియోగాలు, కేరళ వెళ్తానంటూ కోర్టుకెక్కిన భారత సంతతి మహిళ
Advertisement

తాజా వార్తలు