తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్న సర్వేల లిస్ట్..!!

దేశవ్యాప్తంగా ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరిగాయి.చివరి దశ ఎన్నికలు నేటితో ముగిసాయి.

దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్( Exit polls ) విడుదల కావడం జరిగింది.ఏపీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని టుడేస్ చాణిక్య పేర్కొంది.

అదేవిధంగా ఇండియా టీవీ, కేకే ఎగ్జిట్ పోల్స్, ఎస్ జిఈడి, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, న్యూస్ 18, న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్, పల్స్ ఎగ్జిట్ పోల్, ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్, ప్రిజం ఎగ్జిట్ పోల్, సర్వే ఫ్యాక్టరీ ఎగ్జిట్ పోల్.సంస్థలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేన, బీజేపీ( Janasena , BJP ) పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.ఈ మూడు పార్టీలు 2014లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగింది.

Advertisement

కాగా ఇప్పుడు కూడా మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది.ఎట్టి పరిస్థితులలో జగన్ రెండోసారి అధికారంలోకి రాకుండా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా హోం వర్క్ చేసి.పోటీకి దింపడం జరిగింది.

జూన్ 4న ఫలితాలు రాబోతున్న తరుణంలో నేడు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం కూటమి గెలవబోతున్నట్లు పైన చెప్పిన సర్వే సంస్థలు ప్రకటించాయి.

కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్ 
Advertisement

తాజా వార్తలు