ఉద్యోగం కోసం వెతికే వారికి లింక్డ్‌ఇన్ బంపరాఫర్.. ఉచితంగా స్కిల్ లెర్నింగ్ కోర్సులు..!

బెస్ట్ జాబ్ ఆఫర్స్ కోసం వెతికే వారికి జాబ్ సెర్చ్ వెబ్‌సైట్‌లు బాగా ఉపయోగపడతాయి.

కెరీర్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లు కూడా ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడంలో, స్కిల్స్ అలవర్చుకోవడంలో బాగా ఉపయోగపడతాయి.

వాటిలో లింక్డ్‌ఇన్ టాప్ ప్లేస్ లో నిలుస్తోంది.అయితే తాజాగా ఈ ప్లాట్‌ఫామ్ మెరుగైన ఉద్యోగావకాశాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకి సహాయపడడానికి సిద్ధమైంది.

అంతేకాదు, ఈ రోజుల్లో ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ పెంపొందించేందుకు నడుం బిగించింది.ఇందుకు ఈ ఏడాదిలో మోస్ట్ పాపులర్ లెర్నింగ్ కోర్సుల లిస్టును కొద్ది గంటల క్రితమే పబ్లిష్ చేసింది.

అలానే కొన్ని కోర్సులను ఈ నెలాఖరు వరకు ఫ్రీగా అందిస్తామని ప్రకటించింది.పాపులర్ లెర్నింగ్ కోర్సులు ఏవో తెలుసుకుంటే వారు వాటిని నేర్చుకుని ఉద్యోగాలు సంపాదించే అవకాశం పెరుగుతుంది.

Advertisement

మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే జాబ్ మార్కెట్‌లో నెలకొన్న పోటీ అంతా ఇంతా కాదు.

దీంతో ఎన్ని స్కిల్స్ ఉన్నా కొత్త స్కిల్ నేర్చుకోవాలని కంపెనీలు అందర్ని తిరిగి పంపించేస్తున్నాయి.అందుకే ఉద్యోగం కోసం వెతుకులాడే వారు ప్రస్తుత పాపులర్ స్కిల్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుగుపరుచుకోవాలని లింక్డ్‌ఇన్ సలహా ఇస్తోంది.

అలానే, అన్ని రంగాల కంపెనీలలో నెలకొన్న డిమాండ్స్‌కు అనుగుణంగా లింక్డ్‌ఇన్ పలు కోర్సులు అందజేస్తోంది.ఈ స్కిల్స్ ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ను అందరికీ భిన్నంగా, స్పెషల్ గా నిలబెట్టడంతో హెల్ప్ అవుతుంది.తద్వారా జాబ్ రావడం ఖాయం అవుతుంది.

లింక్డ్‌ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం నుంచి బిజినెస్ మోడల్స్, వ్యూహాలు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వరకు పలు రకాల కోర్సులు ఆఫర్ చేస్తోంది.ఆసక్తిగల నిరుద్యోగులు వీటికి సంబంధించిన వివరాలను లింక్డ్‌ఇన్ యాప్ నుంచి పొందవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

ప్రస్తుతం ఫ్రీగానే కోర్సు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు త్వర పడటం మంచిది.

Advertisement

తాజా వార్తలు