పుకార్లను నిజం చేసిన బైరెడ్డి

రాయలసీమ హక్కుల కోసం తీవ్రంగా పోరాడే వ్యక్తుల్లో బైరెడ్డి రాజశేఖరెడ్డి.

ఈయన రాష్ట్రం విడిపోక ముందు నుండి కూడా రాయలసీమ కోసం తనవంతు అన్నట్లుగా పోరాటం చేస్తూ వస్తున్నాడు.

తాజాగా మరోసారి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, మరో రాజధానిని అక్కడ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా ఒంటరిగా ఉన్న ఈయన బీజేపీలో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాను బీజేపీలో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.బీజేపీలో చేరితేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లుగా ఆయన చెప్పాడు.

కేవలం మోడీకి మాత్రమే ఈ దేశంను సమర్ధవంతంగా ముందుకు నడిపించగల సత్తా ఉందని, తెలుగు రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు మరియు జగన్‌ అని వారిపై తెలుగు ప్రజలు కోపంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో వారినే ఎన్నుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు