Lava O2 Smartphone : లావా O2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

లావా O2 స్మార్ట్ ఫోన్( Lava O2 Smartphone ) త్వరలో భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఈ హ్యాండ్ సెట్ అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది.

అమెజాన్ ల్యాండింగ్ పేజీ( Amazon ) ద్వారా ఈ హ్యాండ్ సెట్ వివరాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.అవి ఏమిటో చూద్దాం.ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.

ఈ ఫోన్ ముందు వైపు పంచ్ హోల్ డిజైన్ ను కలిగి ఉంది.వెనుకవైపు AG గ్లాస్ తో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పై పని చేస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 18w ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ అక్టా కోర్ Unisoc T616 చిప్ సెట్( Octacore Unisoc T616 ) ను కలిగి ఉంటుంది.ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x RAM,128GB UFS 2.2 తో జత చేయబడి ఉంటుంది.ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.50ఎంపీ AI డ్యూయల్ కెమెరాలతో వస్తుంది.సెల్ఫీల కోసం, వీడియోల కోసం 8ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.

Advertisement

ఈ ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ స్కానర్( Side Mounted Finger Scanner ) ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ వీడియో ఆధారంగా హ్యాండ్ సెట్ కింది భాగంలో USB-C చార్జింగ్ పోర్టుతో పాటు స్పీకర్ గ్రిల్ ను అమర్చారు.ఈ ఫోన్ వెనుక వైపు లావా లోగో ఉంటుంది.

ఈ ఫోన్ ను చూసే యాంగిల్ ను బట్టి కెమెరా మాడ్యూల్ వివిధ రకాలుగా కనిపిస్తుంది.త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ అవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు