Amardeep tejaswini gowda : అమర్ దీప్ తేజు పెళ్లి జరగడానికి బిగ్ బాస్ కారణమా.. ఇదేం ట్విస్ట్ రా బాబు!

బుల్లితెర నటీనటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి ( Amardeep Chowdary ) తేజస్విని గౌడ( Tejaswini Gowda ) ఒకరు.

తేజస్విని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయి అమర్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అబ్బాయి ఇలా వీరిద్దరు పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇక నిజ జీవితంలో కూడా ఈ జంట ఒకటైన సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోవడంతో అందరూ కూడా వీరిది ప్రేమ వివాహం అని భావించారు కానీ వీరిది పెద్దలు కుదుర్చిన వివాహమని పలు సందర్భాలలో అమర్ తేజు తెలియజేశారు.

ఇలా సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.అయితే మొదటి నాలుగు వారాలు పెద్దగా ఆటపై ఫోకస్ పెట్టని అమర్ ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తన ఆట తీరును కూడా మెరుగుపరుచుకున్నారు.ఇక ప్రస్తుతం ఈయన టైటిల్ రేసులో కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా తేజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

వీరిద్దరి వివాహం కావడానికి బిగ్ బాస్ ( Bigg Boss ) కారణమంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.వీరి పెళ్లికి బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే.బిగ్ బాస్ కార్యక్రమం స్టార్ మాలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే వన్డే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.ఆ క్షణంలో అమర్ తేజు ఇద్దరు కూడా ఈ వన్డే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్పటికి వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని అయితే ఆ షో తర్వాత లేట్ కావడంతో అమర్ తనని డ్రాప్ చేస్తానని చెప్పారు.

అలా ఆరోజు అమర్ తనని డ్రాప్ చేశారని అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారామని తెలిపారు.అయితే ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుంటుందని అనుకొని ఈ విషయాన్ని నాకు చెప్పి వారి పెద్దలను తీసుకువచ్చి మా వారితో మాట్లాడారని అలా మా వివాహం జరిగిందని ఈమె తెలియజేశారు.అయితే మేము ఎప్పుడూ కూడా ప్రేమించుకోలేదని జస్ట్ క్యాజువల్ గా ఫ్రెండ్స్ గా ఉన్నాము.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters

ఇక అమర్ పెళ్లి చేసుకుందామనడంతో తాను కూడా ఒప్పుకున్నానని అనంతరం పెద్దలు మాట్లాడి పెళ్లి నిశ్చయించారని తేజు పలు సందర్భాలలో కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.మొత్తానికి వీరిద్దరి పరిచయానికి బిగ్ బాస్ మరింత సహాయం చేశారని తెలుస్తుంది.

Advertisement
https://www.facebook.com/reel/1278290166896315

తాజా వార్తలు