తెరపైకి లక్ష్మీస్ వీరగ్రంధం! పొలిటికల్ లో ప్రాముఖ్యత ఉంటుందా

చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని ఆర్జీవి తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ని ఎన్నికలు అయ్యేంత వరకు చేయడానికి వీలు లేదని హై కోర్ట్ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

దీనిపై తాను సుప్రీం వరకు వెళ్తా అని ఆర్జీవి అంటున్న.

సుప్రీంలో కేసు కొలిక్కి వచ్చే సరికి ఏపీలో ఎన్నికలు పూర్తయిపోతాయి.అప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తో చంద్రబాబుని దెబ్బ కొట్టాలనే ఆర్జీవి ప్రయత్నం ఫెయిల్ అయినట్లే.

ఇదిలా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా కేతిరెడ్డి అనే దర్శకుడు శ్రిరెడ్డిని మెయిల్ లీడ్ గా పెట్టి లక్ష్మీస్ వీరగ్రంధం అనే సినిమాని తీస్తున్నట్లు ప్రకటించాడు.అలాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేసారు.

అయితే ఈ లక్ష్మీస్ వీరగ్రంధం టీజర్స్ లో కంటెంట్ కంటే అనవసరమైన విషయాలే ఎక్కువ చూపించారు.అలాగే ఎ మాత్రం ఇంటెన్సన్ క్రియేట్ చేయని విధంగా విజువల్ ప్రెజెంట్ చేసారు.

Advertisement

శ్రిరెడ్డి అనే పేరు సినిమా వెనుక వినిపిస్తున్న అంతకు మించిన ప్రాధాన్యత దీనికి లేదు.అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి తన లక్ష్మీస్ వీరగ్రంధంని ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తా అని ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఇది రాజకీయంగా ఎవరికి ఇబ్బంది కాదు కాబట్టి ఎవరు అభ్యంతరం చెప్పకపోవచ్చు.ఒక వేల చెబితే లక్ష్మి పార్వతి మాత్రమె చెప్పాలి.

మరి ఆమె ఎంత వరకు సినిమాపై స్పందిస్తుంది అనేది చూడాలి.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
Advertisement