వరుస సినిమాలకు కమిటవుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో లక్ష్ చదలవాడ.వలయం సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఆయన.
త్వరలోనే గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.
ధీర అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది.
నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు.అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
లక్ష్ చదలవాడ
సమర్పణ : చదలవాడ బ్రదర్స్, బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత : పద్మావతి చదలవాడ, దర్శకుడు : విక్రాంత్ శ్రీనివాస్సంగీతం: సాయి కార్తీక్, సినిమాటోగ్రఫీ : కన్నా పీసీ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్, ఎడిటర్: మధు రెడ్డి, ఫైట్ మాస్టర్ : జాషువా, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy