టెక్సాస్ పోలీసులకి షాక్ ఇచ్చిన మహిళ మృతదేహం...!!!

అమెరికాలోని టెక్సాస్ లో పాడుబడిన ఇంట్లోనుంచీ మంటలు వస్తున్నాయని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అది పాడుబడిన ఇల్లని తెలుసుకున్నారు.

అయితే ఎందుకైనా మంచిదని మంటలు వస్తున్నా సరే లోపలి వెళ్లి చూడగా కాలిపోతున్న ఓ మహిళ శరీరం కనిపించింది.

ఓ పాడుబడిన ఇంట్లో మహిళ ఉండటం, చుట్టూ పక్కల వారికి ఆ కాలుతున్నప్పుడు అరుపులు కూడా వినిపించడం అంతా మిస్టరీగా మారింది.ఈ ఘటన టెక్సాస్‌లోని ఫోర్త్ ఎవెన్యూలో జరిగింది.

పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ ఇంటి గోడలు పగుళ్ళు తో ఉన్నాయని, అక్కడ వండుకుని తినడానికి కొన్ని సామాన్లు సరుకులు ఉన్నాయని.ఆమెతో ఒక్కతే ఇక్కడ ఉందని గ్రహించారు.

అయితే తమకి ఉన్న సమాచారం మేరకు ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని, ఈ మహిళ కి ఎవరూ ఉండిఉండరు ఎక్కడ ఉండటానికి లేకపోవడంతోనే ఆమె ఇక్కడ ఉందని భావిస్తున్నారు.అయితే ప్రమాద వశాత్తు ఆమె చనిపోయిందా లేక కావాలని ఆమెని ఎవరైనా చంపి ఇంటికి నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement