Kumari Aunty Keerthi Bhat : కీర్తి భట్ వ్యాఖ్యలపై స్పందించి కూల్ గా చురకలు అంటించిన కుమారి ఆంటీ?

ఫుట్ పాత్ దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధి పెట్టుకున్నటువంటి కుమారి ఆంటీ( Kumari Aunty ) ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఎన్నో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు.

దీంతో ఈమెకు బుల్లితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు వస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ఇక ఈమె ఫుడ్ గురించి ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాల వీడియోలు చేశారు.

Kumari Aunty Counter To Keerthi Bhat

సీరియల్ నటి కీర్తి భట్( Keerthi Bhat ) మాత్రం ఈమె ఫుడ్ గురించి కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో సంచలనంగా మారింది.తాము కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్ టేస్ట్ చేయాలని వెళ్ళాము అయితే ఆమె లేకపోవడంతో అక్కడ ఫుడ్( Kumari Aunty Food ) తీసుకున్నామని చికెన్ టేస్ట్ మాత్రం బాగాలేదని చాలా కారంగా ఉందని ఏమాత్రం భోజనాలు రుచిగా లేవంటూ కీర్తి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ వీడియో పై కుమారి ఆంటీ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kumari Aunty Counter To Keerthi Bhat

కీర్తి గారు అక్కడికి వచ్చినప్పుడు నేను వేరే ఊరికి వెళ్లాను ఆరోజు వంట నేను చేయలేదు.మగవాళ్ళు చేసిన వంటకు ఆడవాళ్లు చేసిన వంటకు చాలా తేడా ఉంటుంది .ఆమె ఫుడ్ బాగాలేదు అన్నప్పటికీ నేను ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తానని చాలా హుందాగా చెప్పారు.ప్రతి ఒక్కరికి నేను చేసిన ఫుడ్ నచ్చాలని లేదు.

Advertisement
Kumari Aunty Counter To Keerthi Bhat-Kumari Aunty Keerthi Bhat : కీర్�

వాళ్లు నా గురించి చెడుగా చెప్పినంత మాత్రాన నేను వారిని తప్పుగా భావించను అంటూ ఈమె చాలా కూల్ గా కీర్తికి చురకలంటించారు.ఇలా కుమారి ఆంటీ స్పందించిన తీరు అందరిని ఆకట్టుకుంది .ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ.ఈమెకు పెద్దగా చదువు లేకపోయినా చాలా హుందాగా వ్యవహరించింది కానీ మీరు మాత్రం వ్యూస్ కోసం ఆమెను చెడు చేసే ప్రయత్నం చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు