టీఆర్ఎస్ లో కేటీఆర్ కి కీలక బాధ్యతలు

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర వహించిన కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించారు.

అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించినట్లుగా తెలుస్తోంది.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించడంతో పార్టీలో సంబరాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు