తెలంగాణ కౌంటింగ్ కి ముందు కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్..!!

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్( Telangana Elections Counting ) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి( Congress ) అనుకూలంగా వచ్చాయి.మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి( BRS ) చెందిన వాళ్లు తాము అధికారంలోకి వస్తామని.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు అవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కౌంటింగ్ కి ముందు మంత్రి కేటీఆర్( Minister KTR ) సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు.

"హ్యాట్రిక్ లోడింగ్ 3.0 సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి" అని ట్వీట్ చేయటం జరిగింది.దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు.

Advertisement

కేటీఆర్ కామెంట్ పట్ల చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) సైతం గెలుపు పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అంతేకాదు డిసెంబర్ 4వ తారీఖు మొదటి క్యాబినెట్ మీటింగ్ అని కూడా ప్రకటించడం జరిగింది.ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుల సైతం తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.

ఈ రకంగా ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు.మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో.

మరి కొద్ది గంటల్లో తెలియనుంది.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?
Advertisement

తాజా వార్తలు